Chandra Babu Case : చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్
30న హాజరు కావాల్సిందేనని ఆదేశం
Chandra Babu : విజయవాడ – ఏపీ స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ హైకోర్టు మంజూరు చేయడంతో పట్ట పగ్గాలు లేకుండా పోయాయి టీడీపీ శ్రేణులకు. కానీ ఇదే కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 30న హాజరు కావాల్సిందేనంటూ స్పష్టం చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదన్న సాకుతో హైదరాబాద్ లోనే ఉంటానంటే ఊరుకునే ప్రసక్తి లేదని పేర్కొంది కోర్టు.
Chandra Babu Case Issue
మధ్యంతర బెయిల్ పై ఈనె 28 వరకు మాత్రమే మంజూరు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో గత ఆగస్టు 9న రాజమండ్రి జైలుకు వెళ్లారు. రిమాండ్ ఖైదీగా గడిపారు. దాదాపు 53 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. బయటకు రావడానికి నానా తంటాలు పడ్డారు. పేరు పొందిన లాయర్లు, న్యాయవాదులను ఉపయోగించారు. వారంతా తమ ప్రతిభను కేవలం బాబు(Chandra Babu) బయటకు రావడానికి ప్రయత్నం చేశారు.
కానీ ఏసీబీ కోర్టు జడ్జి మాత్రం ఇవేవీ పట్టించు కోలేదు. ఆ వెంటనే చంద్రబాబుకు కస్టడీ విధించింది. దేశ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ తీర్పు ఇచ్చింది ఎవరో కాదు ఓ మహిళా న్యాయమూర్తి కావడం. మొత్తం మీద చంద్రబాబు ఆరోజు హాజరవుతారా లేక తనకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందని ఆగి పోతారా తెలియాల్సి ఉంది.
Also Read : Ambati Ram Babu : వచ్చింది బెయిలే నిర్దోషి కాదు