Chandra Babu Naidu : బాబుకు షాక్ రిమాండ్ పొడిగింపు

ఏసీబీ కోర్టు సంచ‌ల‌న తీర్పు

Chandra Babu Naidu : విజ‌య‌వాడ – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ చీఫ్‌, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆయ‌న ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఏవీ క‌నిపించ‌డం లేదు.

Chandra Babu Naidu Remand Extended

ఇదే కేసుకు సంబంధించి గురువారం విజ‌య‌వాడ లోని ఏసీబీ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. బెయిల్ పిటిష‌న్ పై విచారించిన కోర్టు వాదోప వాద‌న‌లు విన్న అనంత‌రం మ‌రో 14 రోజులు రిమాండ్ విధిస్తున్న‌ట్లు జ‌డ్జి తీర్పు చెప్పారు. దీంతో బ‌య‌ట‌కు రావాల‌ని ఆశిస్తున్న చంద్ర‌బాబుకు జైలుకు ప‌రిమితం అయ్యేలా క‌నిపిస్తోంది.

మ‌రో వైపు త‌న‌కు బెయిల్ పిటిష‌న్ ఇవ్వాలంటూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను హైకోర్టు కొట్టి వేసింది. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా చుక్కెదురైంది. విచార‌ణ‌ను సోమ వారానికి వాయిదా వేసింది కోర్టు.

ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu Naidu) ఊపిరి పీల్చుకోనీయ‌కుండా ప్ర‌భుత్వం కేసులు బ‌నాయించింది. ఒక‌టి ఏపీ స్కిల్ స్కాం కేసు కాగా మ‌రొక‌టి అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు స్కాం, ఫైబ‌ర్ నెట్ స్కాం కేసు కూడా న‌మోదు చేసింది ఏపీ సీఐడీ.

Also Read : IT Raids : హైద‌రాబాద్ లో ఐటీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!