AP Budget 2024-25 : ఏపీ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సర్కార్
వడ్డీలేని రునాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని అచ్చెన్న చెప్పారు...
AP Budget : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్‌తో పాటు రూ. 43,402 కోట్లతో ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టింది సర్కార్. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అగ్రికల్చర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అచ్చెన్నాయుడు.. ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం వెన్నెముకగా పేర్కొన్నారు. రైతు అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. రైతులకు ఆధునిక పనిముట్లు, రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి అచ్చెన్న(Minister Atchannaidu) తెలిపారు.
AP Budget 2024-25 Updates
వడ్డీలేని రునాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యమిస్తామని అచ్చెన్న చెప్పారు. రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో భూసార పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే మట్టి నమూనాల కోసం ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదిక వ్యవసాయ మంత్రి ప్రకటించారు. సాగుకు సూక్ష్మ పోషకాలు అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం.. వ్యవసాయ రంగానికి నిర్ధిష్ట ప్రణాళిక అవసరం అన్నారు మంత్రి. పెట్టుబడి సాయం పెంచి నెల రోజుల్లోనే అందించామని చెప్పారు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే.. లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్ రూపొందించామని మంత్రి తెలిపారు. వ్యవసాయం ఆధారంగా 62% మంది జీవిస్తున్నారని.. 2047 టార్గెట్‌తో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
వ్యవసాయబడ్జెట్‌లో దేనికి ఎంత కేటాయించారంటే..
రూ.43,402కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
రాయితీవిత్తనాలకు రూ.240 కోట్లు
భూసారపరీక్షలకు రూ.38.88 కోట్లు
విత్తనాలపంపిణీకి రూ.240 కోట్లు
ఎరువులసరఫరాకు రూ.40 కోట్లు
పొలంపిలుస్తోంది రూ.11.31 కోట్లు
PACSలద్వారా ఎరువుల పంపిణీ
డిజిటల్‌వ్యవసాయం – రూ.44.77 కోట్లు
వ్యవసాయయాంత్రీకరణ – 187.68 కోట్లు
వడ్డీలేని రుణాలు – రూ.628 కోట్లు
అన్నదాతసుఖీభవ – రూ.4,500 కోట్లు
రైతుసేవా కేంద్రాలు – రూ.26.92 కోట్లు
ఇంటిగ్రేటెడ్‌అగ్రి ల్యాబ్స్ – రూ.44.03 కోట్లు
పంటలబీమా – రూ.1,023 కోట్లు
వ్యవసాయశాఖ – రూ.8,564.37 కోట్లు
ఉద్యానశాఖ- రూ.3,469.47 కోట్లు
పట్టుపరిశ్రమ – రూ.108.44 కోట్లు
వ్యవసాయమార్కెటింగ్ – రూ.314.8 కోట్లు
సహకారశాఖ – రూ.308.26 కోట్లు
ప్రకృతివ్యవసాయం – రూ.422.96 కోట్లు
ఎన్జీరంగా యూనివర్సిటీ – రూ.507.3 కోట్లు
ఉద్యానయూనివర్సిటీ – రూ.102.22 కోట్లు
వ్యవసాయపశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
ఫిషరీస్‌యూనివర్సిటీ – రూ.38 కోట్లు
పశుసంవర్థక శాఖ – రూ.1,095.71 కోట్లు
మత్స్యరంగంఅభివృద్ధి – రూ.521.34 కోట్లు
ఉచితవ్యవసాయ విద్యుత్ – రూ.7,241.3 కోట్లు
ఉపాధిహామీ అనుసంధానం – రూ.5,150 కోట్లు
ఎన్టీఆర్‌జలసిరి – రూ.50 కోట్లు
నీటిపారుదలప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు
Also Read : Harish Rao : రాష్ట్రవ్యాపంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంపై భగ్గుమన్న మాజీ మంత్రి