AP Cabinet: పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

AP Cabinet : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినెట్‌(AP Cabinet) సమావేశం నిర్వహించారు. ఏపీ సచివాలయంలో జరిగిన భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రిమండలి చర్చించి ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ, సీఆర్డీఏ, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాలు వంటి 24 ప్రధాన అంశాలే అజెండాగా క్యాబినెట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

AP Cabinet Decisions

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించింది. బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Also Read : AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!