AP Cabinet Ok : సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏపీ సర్కార్ సంక్షేమ రాగాన్ని ఆలాపిస్తోంది. ఎన్ని కోట్లు అయినా సరే జన సంక్షేమానికే ప్రయారిటీ ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా జగన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. కీలకమైన నిర్ణయాలకు, సంక్షేమ పథకాలకు ఓకే చెప్పింది కేబినెట్.
ఈ సందర్భంగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రుల పనితీరును కూడా మెచ్చుకున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా విద్యా, ఆరోగ్య శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు బొత్స సత్యనారాయణ, విడుదల రజనీని అభినందించారు.
కొత్త సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ప్రకటించే సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్(AP Cabinet Ok). ఇదే సమయంలో కొత్త సంవత్సరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం జగన్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు మంత్రివర్గం సమ్మతించింది. సీఎంను అభినందించింది. కర్నూల్ జిల్లాలో రెండో లా యూనివర్శిటీ ఏర్పాటుకు, భారీ పరిశ్రలను ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
తాడేపల్లి గూడెంలో రెవిన్యూ, పోలీస్ డివిజన్లకు ఓకే చెప్పింది. చిత్తూరు డెయిరీ రాష్ట్ర సర్కార్ కు బాకీ పడిన రూ. 106 కోట్లను మాఫీ చేసేందుకు కూడా ఆమోదం తెలపడం విశేషం. కళ్యాణమస్తు, షాదీ తోఫాను ఫిబ్రవరి 10 నుంచి అమలు చేయనుంంది. వైఎస్సార్ లా నేస్తం, ఆసరా, ఈబీసీ నేస్తం, కళ్యాణ మస్తులకు మంత్రివర్గం ఓకే చెప్పింది.
ఇదిలా ఉండగా ఏపీ కేబినెట్ సమావేశంలో మొత్తం 70 అంశాలపై అజెండాలో చర్చించారు. ప్రాధాన్యత క్రమంలో మంత్రివర్గం చర్చించింది.
Also Read : శ్రీహరి..రాజయ్యపై షర్మిల ఫైర్