AP CID : అమరావతి – ఏపీ సీఐడీ బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీకి చెందిన నారాయణకు, ఆయన భార్యకు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. తాజాగా పునీత్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 11న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
AP CID Notices Given to Narayana’s Family
ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ స్కాం కేసులో పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. మరో వైపు ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో అడ్డంగా బుక్ చేసింది ఏపీ సీఐడీ.
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడితో పాటు నారా లోకేష్ , నారాయణను(Narayana) చేర్చారు. ఏ14 కింద ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇవాళ విచారణ చేపట్టింది. ఈ మేరకు లోకేష్ హాజరయ్యారు. తనను కావాలని వేధింపులకు గురి చేస్తున్నారని, తన భూములు కూడా పోయాయని కొనకళ్ల నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒక రూపంలో తమను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆరోపించారు. తాజాగా ఏపీ సీఐడీ తన అల్లుడికి కూడా నోటీసులు జారీ చేయడంతో విస్తు పోయారు. మొత్తంగా బాబు ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.
Also Read : Chandra Babu Naidu : బాబుకు జైలేనా బెయిల్ వచ్చేనా..?
