Ramoji Rao CID : రామాజీ రావు..శైలజా కిరణ్ కు షాక్
ఏపీ సీఐడీ విచారణ ప్రారంభం
Ramoji Rao CID : మీడియా బారెన్ గా పేరు పొందిన ఈనాడు, మార్గదర్శి సంస్థల చైర్మన్ రామోజీ రావుతో పాటు ఎండీ శైలజా కిరణ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అక్రమాలు జరిగాయని, నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ రామోజీ రావును(Ramoji Rao CID) ప్రశ్నించే ప్రయత్నం చేశారు సీఐడీ అధికారులు.
ఏపీ సీఐడీకి చెందిన 200 మంది పోలీసులతో కూడిన భారీ బృందం మార్గదర్శి ఎండీగా ఉన్న శైలజా కిరణ్ నివాసానికి చేరుకున్నారు. ఆమెను ప్రశ్నించారు. ఇదే సమయంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న రామోజీరావు కూడా శైలజ ఇంటికి చేరుకున్నారు.
ఈ కేసులో ఆయనను నిందితుడిగా నెంబర్ 1 (ఏ-1)గా పేర్కొన్నారు. శైలజా నివాసం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామోజీరావు , శైలజా కిరణ్ లను సీఐడీ అధికారులు విడి విడిగా ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎంత సేపు అనేది తెలియ రాలేదు.
ఇదిలా ఉండగా గత మంగళవారం అందజేసిన నోటీసుల్లో రామోజీరావు, శైలజలను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు నాలుగు తేదీలు ఇచ్చారు. మార్చి 20, మార్చి 31, ఏప్రిల్ 3 లేదా ఏప్రీల్ 6న ప్రశ్నించేందుకు అంగీకరించినట్లు సమాచారం. సీఐడీ(CID) క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160 ప్రకారం వారి నివాసం , కార్యాలయంలో పరిశీలించేందుకు నోటీసులు జారీ చేసింది. చిట్ ఫండ్ కంపెనీకి చెందిన వివిధ శాఖల బ్రాంచ్ మేనేజర్లను కూడా విచారణ సంస్థ పిలిపించింది.
Also Read : హస్తినలో జనసేనాని బిజీ బిజీ