Nara Lokesh Case : ,b> లోకేష్ అరెస్ట్ కు ఏపీ సీఐడీ సిద్దం
స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు
Nara Lokesh Case : అమరావతి – ఏపీ హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను పక్కన పెట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు.
Nara Lokesh Case Viral
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కు సంబంధించి భారీ కుంభకోణం జరిగిందని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. నారా లోకేష్ తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా సీఐడీ నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని , కేసుకు సంబంధించి విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. నారా లోకేష్(Nara Lokesh) ను ఏపీ సీఐడీ ఎ14గా చేర్చింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు బయలు దేరారు.
ఇదే సమయంలో తన తండ్రి, టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీ స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Also Read : CPI Ramakrishna : జగన్..అదానీ భేటీ వెనుక కథేంటి