AP CM Jagan PM : ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
రాష్ట్రానికి చెందిన సమస్యలపై ప్రస్తావన
AP CM Jagan PM : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో ఉన్నారు. ఇందులో భాగంగా సీఎం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో(AP CM Jagan PM) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించారు.
రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ను కోరారు.
అంతే కాకుండా ప్రభుత్వం చేపట్టిన పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి విన్నవించారు జగన్ రెడ్డి. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని త్వరితగతిన అందించేలా చూడాలన్నారు.
ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు ఈ సందర్భంగా సీం పీఎంతో. ఇదిలా ఉండగా జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా వెంట ఉన్నారు.
వీరిద్దరూ కలిసి పీఎంతో భేటీ కావడం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాల మేరకు నిధులు విడుదల చేయాలని విన్నవించారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం లోని పెండింగ్ అంశాలను ప్రత్యేకంగా జగన్ మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ ముందు ప్రస్తావించారు.
అనంతరం మర్యాద పూర్వకంగా దేశ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీష్ ధన్ ఖర్ ను కలవనున్నారు ఏపీ సీఎం. మరో వైపు బీజేపీ ఎంపీ వర్మ చేసిన కామెంట్స్ గుబులు రేపుతున్నాయి.
Also Read : ట్రబుల్ షూటర్ తో టార్చ్ బేరర్ భేటీ