CM YS Jagan : విద్యా రంగానికి జగన్ భరోసా
నాలుగేళ్లలో రూ. 60 , 329.42 కోట్లు
CM YS Jagan : రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంతగా విద్యా రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానంగా సీఎం జగన్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. విద్య పరంగా ఉన్నత విద్యావంతులైతే వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగలరని ఆశించారు. ఆ మేరకు జగన్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదు. ఎవరు ఏమన్నా ఆయన లెక్క చేయకుండా విద్యా రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. అంతే కాదు రాష్ట్ర బడ్జెట్ లో అత్యధిక శాతం కేటాయింపులు జరిగిన ఘనత సీఎంకే దక్కతుంది.
విద్యా రంగానికి సంబంధించి నాడు నేడు కింద అత్యాధునిక సౌకర్యాలకు బడులను తీర్చిదిద్దారు. ఇందు కోసం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని సలహాదారుగా నియమించారు. ప్రత్యేకించి పేద విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నది జగన్ రెడ్డి(CM YS Jagan) ఆశయం. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చర్యలు చేపట్టారు. ఏపీకి చెందిన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని ఆయన ఆశయం.
ఇదిలా ఉండగా విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్యకు భరోసా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు జగన్ రెడ్డి. రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలలో ఏకంగా రూ. 60,329.42 కోట్లు చేసింది ఏపీ ప్రభుత్వం.
Also Read : Satya Pal Malik : నేను ఏ పార్టీలో చేరను – సత్య పాల్