YS Jagan : వరద బాధితులకు సీఎం భరోసా
ఎడతెగని వర్షాలతో తప్పని ఇక్కట్లు
YS Jagan : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి ఏపీ తల్లడిల్లుతోంది. పలు చోట్ల జన జీవనం స్తంభించి పోయింది. పలు గ్రామాలకు లింకులు తెగి పోయాయి. గాజులదిన్నె, సుంకేశుల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఇక ఇటు ఏపీలో అటు తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి.
ఇక గతంలో ఎన్నడూ లేని రీతిలో అనంతపురం జిల్లాను వర్షం ముంచెత్తింది. పలు కాలనీల్లోకి నీళ్లు వచ్చి చేరాయి. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాల దెబ్బకు జన జీవనం స్తంభించి పోయింది. వర్షాల కారణంగా ఎవరూ ఇబ్బందులు పడ కూడదని స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(YS Jagan).
ఈ మేరకు ఆయన సీఎస్ , ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. వరద బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్లు దగ్గరుండి పర్యవేక్షించాలని అన్నారు జగన్ రెడ్డి.
వరదల కారణంగా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ . 2 వేల ఆర్థిక సహాయం తక్షణమే ఇవ్వాలని ఆదేశించారు సెం. అంతే కాకుండా అవసరమైన రేషన్ కూడా ఇవ్వాలన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం పనికి రాదన్నారు. బియ్యం, పప్పు, పామోలిన్ , ఉల్లిపాయలు, బంగాళా దుంపలు పంపిణీ చేయాలని అన్నారు జగన్ రెడ్డి.
వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారిక యంత్రాంగం నష్టాన్ని అంచనా వేయాలని, పంట నష్ట పరిహారాన్ని రైతులకు త్వరగా అందించాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి.
Also Read : కార్యకర్తలే బలం విజయం తథ్యం – జగన్