AP CM YS Jagan : దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
AP CM YS Jagan : తాడేపల్లి గూడెం – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తాజాగా సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ రెడ్డిని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల మేలుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. నిరుపేదలు లబ్ది పొందేలా చర్యలు చేపట్టామని వారికి తెలిపారు సీఎం.
AP CM YS Jagan Comment
ఎలాంటి వివక్ష లేకుండా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నామని స్పష్టం చేశారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చామని తెలిపారు జగన్ రెడ్డి(AP CM YS Jagan). బరియల్ గ్రౌండ్స్ సమస్య పరిష్కరిస్తానని, చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అంతే కాకుండా చర్చీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూళ్లు, సేవా భవనాలకు మున్సిపల్ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చే విషయంపై ఆలోచిస్తానని స్పష్టం చేశారు జగన్ రెడ్డి. మతం మారినంత మాత్రాన పేదరికం పోదని ఈ సందర్భంగా క్రైస్తవ ప్రతినిధులు తెలిపారు.
ఇదిలా ఉండగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చే విషయంపై ఇప్పటికే కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని, కేంద్రానికి పంపించామని చెప్పారు జగన్ రెడ్డి.
Also Read : Minister KTR : ఆందోళనలు చేస్తామంటే ఒప్పుకోం