AP CM YS Jagan : యువ న్యాయ‌వాదుల‌కు జ‌గ‌న్ ఆసరా

రెండో విడ‌త వైఎస్సార్ లా నేస్తం జ‌మ

AP CM YS Jagan : అమ‌రావ‌తి – ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) సోమ‌వారం యువ న్యాయ‌వాదుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఎప్ప‌టి లాగే ఆయ‌న వైఎస్సార్ లా నేస్తం కింద డ‌బ్బులు జ‌మ చేయ‌డం విశేషం. యువ న్యాయ‌వాదుల‌కు తొలి 3 ఏళ్ల పాటు అండ‌గా ఉంటూ వ‌చ్చారు ఏపీ స‌ర్కార్.

AP CM YS Jagan New Scheme for New Advocates

2023-24 సంవ‌త్స‌రానికి రెండో విడ‌త కింద భారీ ఎత్తున నిధుల‌ను జ‌మ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియ‌ర్ లాయ‌ర్లు ఉన్నారు. వీరికి ప్ర‌తి నెలా రూ.5,000 స్టైఫండ్ ఇస్తూ వ‌స్తోంది. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబ‌ర్ దాకా ఆరు నెల‌లకు సంబంధించి ఒక్కొక్క‌రికీ రూ. 30,000 ఇస్తూ మొత్తం రూ. 7,98,95,000 ను క్యాంపు కార్యాల‌యంలో బ‌ట‌న్ నొక్కి వారి వారి ఖాతాల్లో జ‌మ చేశారు జ‌గ‌న్ రెడ్డి.

ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం మాట్లాడారు. దేవుడి ద‌య‌తో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. వ‌రుస‌గా గ‌త నాలుగు ఏళ్లుగా వైఎస్సార్ లా నేస్తం కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌చ్చామ‌ని తెలిపారు. లా చ‌దువు పూర్తి చేసుకుని త‌మ వృత్తిలో తాము నిల‌బ‌డేందుకు గాను ప్రోత్సాహ‌కంగా ఇస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి ఒక్క జూనియ‌ర్ న్యాయ‌వాదికి రూ . 5,000 చొప్పున ఏడాదికి రూ. 60 వేల చొప్పున అంద‌జేశామ‌న్నారు.

Also Read : Telangana Speaker : 14న తెలంగాణ స్పీక‌ర్ ఎన్నిక

Leave A Reply

Your Email Id will not be published!