AP CM YS Jagan Distribute : అక్కా చెల్లెమ్మళ్లకు ఇళ్ల పంపిణీ
భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం
AP CM YS Jagan Distribute : ఆంధ్రప్రదేశ్ – రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) కృషి చేస్తున్నారు. భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అక్క చెల్లెమ్మళ్లకు ఇప్పటికే ఏకంగా 30.75 లక్షల ఉచిత ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద శర వేగంగా 21.76 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇది రాష్ట్రంలో ఓ రికార్డుగా చెప్పవచ్చు.
AP CM YS Jagan Distribute Houses
7.43 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసింది సర్కార్. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో పేదలైన లబ్దిదారులకు లాంఛనంగా ఇళ్లను అందించనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీ లే అవుట్లను అభివృద్ది చేశారు. 71 వేల 811 ఎకరాల విస్తీర్ణంలో 30.75 ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఒక్కో ప్లాట్ విలువ దాదాపు రూ. 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఉంటుంది. వీటి విలువ రూ. 76.000 కోట్ల పైమాటే. నవరత్నాల కింద కట్టిన ఇళ్ల నిర్మాణం విలువ దాదాపు 56 వేల కోట్లు కావడం విశేషం.
ఇంటి స్థలంతో పాటు ఉచితంగా ఇల్లు కట్టు కునేందుకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తోంది. ఉచితంగా ఇసుక, ఇతర సామాగ్రిని కూడా అందజేస్తోంది. కాలనీల్లో రూ. 32,900 కోట్లతో నీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ , సీసీ రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తోంది ఏపీ సర్కార్.
Also Read : Taneti Vanita : ఆరోగ్య సురక్ష శ్రీరామ రక్ష