YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి తాను చెప్పినట్లుగానే చేసి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆయన విద్య, వైద్యం , వ్యవసాయం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు,
మహిళా సాధికారత పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మహిళలు, యువతులు, బాలికలకు ఎక్కడ ఇబ్బందులు ఏర్పడినా లేదా వేధింపులకు గురైనా వెంటనే ఆదుకునేందుకు దిశ ను ఏర్పాటు చేశారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రత్యేకంగా మహిళల కోసం పోలీస్ స్టేషన్లను, కౌన్సెలింగ్ సెంటర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే దిశ యాప్ ను లక్షలాది మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఎవరైనా బాధితులు ఫోన్ చేసినట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న దిశ వాహనాలు అక్కడికి చేరుకుంటాయి.
ఇందుకు సంబంధించి ఇవాళ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిశ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్ రెడ్డి(YS Jagan ). ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించారు.
మహిళల రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్బంగా సీఎం జగన్ రెడ్డి మాట్లాడారు.1.16 కోట్ల మంది దిశ యాప్ ను ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు.
మహిళలకు అన్యాయం జరిగితే తమ ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో 900 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.
3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలు ప్రారంభిస్తామని చెప్పారు జగన్ రెడ్డి(YS Jagan ). కాగా దిశ ఏర్పాటు వల్ల నేరాల సంఖ్య తగ్గిందన్నారు సీఎం.
Also Read : నిర్మాత బన్నీవాసు నన్ను వాడేసుకుని….