AP CM YS Jagan : మూరుమూల పల్లెల్లో జియో సేవలు
100 జియో టవర్లను ప్రారంభించిన సీఎం
AP CM YS Jagan : ఏపీలో ఇక మారుమూల పల్లెలకు సైతం జియో ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలు అందనున్నాయి. గురువారం తాడేపల్లి గూడెం లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan) ఒకే బటన్ నొక్కి 100 జియో టవర్లను వర్చువల్ గా ప్రారంభించారు. పల్లెలకు సైతం 4జీ సేవలు అందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కనెక్టివిటీ లేక పోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండేవన్నారు జగన్ రెడ్డి.
జియో టవర్ల ఏర్పాటు వల్ల దాదాపు 209 మారమూల ప్రాంతాలైన పల్లెలకు కనెక్టివిటీ సేవలు అందనున్నాయని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 85 టవర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 10 టవర్లు, అన్నమయ్య జిల్లాలో 3 టవర్లు, వైఎస్సార్ జిల్లాలో 2 టవర్లను సీఎం ప్రారంభించారు. ఈ టవర్లను త్వరితగతిన రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు రిలయన్స్ సంస్థ ప్రతినిధులు.
టవర్ల ఏర్పాటు వల్ల పల్లెల్లో ప్రభుత్వ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఆయా గ్రామాల్లోని సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ , ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ మరింత అనుసంధానం కానున్నాయి. విద్యార్థులకు ఇ లెర్నింగ్ సదుపాయం కలుగుతుంది. ఆరోగ్య సేవలు మెరుగు పడనున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసుల ద్వారా పల్లెలకు మేలు జరుగుతుందన్నారు జగన్.
Also Read : AP CM YS Jagan : మూరుమూల పల్లెల్లో జియో సేవలు