AP CM : సేవకు పురస్కారం అభినందించిన సీఎం
స్వచ్ఛ సర్వేక్షణ్ కింద ఏపీకి అవార్డులు
AP CM : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ -2022 కింద ప్రతి ఏటా పౌర సేవలు అందించిన ప్రభుత్వ సంస్థలకు పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా దేశ వ్యాప్తంగా పురస్కారాలు అందజేసింది కేంద్రం. ఇదిలా ఉండగా అవార్డులు పొందిన ఏపీకి చెందిన కార్పొరేషన్ మేయర్లు, కమిషనర్లు, మున్సిపాలీటీల చైర్ పర్సన్ లను ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(AP CM) అభినందించారు.
అవార్డు పొందిన పౌర సంఘాల నిర్వాహకులు సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా ప్రశంసలతో ముంచెత్తారు. రాబోయే రోజుల్లో ఇదే స్పూర్తితో కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ఆయా సంస్థలకు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు సీఎం.
స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ లో భాగంగా హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 సర్వేలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 11 అవార్డులు దక్కాయి.
ఇదిలా ఉండగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో పాటు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు ఉన్నారు.
వీరితో పాటు పులివెందుల, పుంగనూరు, పొదిలి, సాలూరు చైర్ పర్సన్ లు , కమిషనర్లు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ మేయర్ ఆర్. శిరీష, కమిషనర్ అనుపమ అనాజలి, విజయవాడ మేయర్ ఆర్. భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ , అడిషనల్ కమిషనర్ కె.వి.సత్యవతి, విశాఖపట్నం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, కమిషనర్ రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
Also Read : ప్రమాదంలో దేశ ఆర్థిక వ్యవస్థ