AP CM YS Jagan : అంత‌టా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం జ‌గన్

AP CM YS Jagan : అమ‌రావ‌తి – తుపాను తీవ్ర‌త కార‌ణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంద‌ర్భంగా అత్యవ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తుపాను దృష్ట్యా ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

AP CM YS Jagan Comment

అయితే తుఫాన్ల‌ను ఎదుర్కోవ‌డంలో యంత్రాంగానికి అనుభ‌వం ఉంద‌న్నారు ఏపీ సీఎం. ముందు జాగ్ర‌త్త‌గా ఇప్ప‌టికే అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు నిధులు విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌తి జిల్లాకు సీనియ‌ర్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తున్న‌ట్లు తెలిపారు.

ఎలాంటి ప్రాణ న‌ష్టం లేకుండా చూడాల‌ని, పూర్తి బాధ్య‌త‌తో విధులు నిర్వ‌హించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan) ఆదేశించారు. స‌హాయ‌క చ‌ర్య‌లు యుద్ద ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రు నిర్లక్ష్యం వ‌హించ కూడ‌ద‌ని పేర్కొన్నారు.

బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌ని , వారికి సాయం చేసేందుకు ముందుకు రావాల‌ని ఇందుకు ప్ర‌భుత్వం రెడీగా ఉంద‌న్నారు ఏపీ సీఎం.

Also Read : CLP Meeting : హ‌స్తిన‌కు చేరిన సీఎం ఎంపిక

Leave A Reply

Your Email Id will not be published!