YS Jagan Davos : వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జగన్ బిజీ
డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ క్లాజ్ ష్వాప్ తో భేటీ
YS Jagan Davos : ఏపీలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ (YS Jagan Davos) లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బిజీగా మారారు.
పలువురు పారిశ్రామికవేత్తలు, పేరొందిన కంపెనీల సిఇఓలు, చైర్మన్లతో సమావేశం అయ్యారు. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన డబ్ల్యూఈఎఫ్ ఫౌండర్ క్లాజ్ ష్వాప్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి , క్లాజ్ ష్వాప్ వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు.
అంతే కాకుండా పారిశ్రామికవేత్తలు తమ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు సులభమైన పారిశ్రామిక పాలసీని తీసుకు వచ్చామని తెలిపారు. అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి(YS Jagan Davos) .
ఏపీలో పెట్టుబడులు పెట్టి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ మెంట్స్ సాధించేందుకు సీఎం తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన వెంట వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు.
ఈనెల 22 నుంచి 26 వరకు ఈ సదస్సు జరగనుంది. ఏపీలో పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రయారిటీ గురించి క్లాజ్ ష్వాప్ తో చర్చలు జరిపారు. ఇదిలా ఉండగా దావోస్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను సీఎం ప్రారంభించారు. స్టాళ్లను కూడా పరిశీలించారు.
Also Read : పీఆర్సీ అమలుపై ఏపీ సర్కార్ జీఓ జారీ