AP CM YS Jagan : బాబు అరెస్ట్ లో నా ప్రమేయం లేదు
స్పష్టం చేసిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
AP CM YS Jagan : అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజుల నుంచి తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై స్పందించారు.
AP CM YS Jagan Comment
ఏపీ స్కిల్ స్కాంలో అవినీతికి పాల్పడడం, కీలకమైన ఆధారాలు దొరకడం వల్లనే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తాను చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించానని చెప్పడం దారుణమన్నారు జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan).
విచిత్రం ఏమిటంటే ఆయనను అరెస్ట్ చేసిన సమయంలో తాను ఏపీలో లేనన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నానని చెప్పారు. కేంద్రంలో కొలువు తీరింది బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఇందులో ఎక్కువగా ఉన్న వాళ్లు టీడీపీ వాళ్లేనని , ఈ విషయంలో తాను ఎలా అరెస్ట్ చేయమని చెబుతానంటూ ప్రశ్నించారు.
ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. టీడీపీ సీనియర్ నేతలు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : Election Code : 5 రాష్ట్రాలలో ఎన్నికల కోడ్ అమలు
