YS Jagan : ఏపీ వైపు పారిశ్రామిక దిగ్గజాల చూపు
ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
YS Jagan : దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు ఏపీలో అమలు అవుతున్నాయని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, పరిశ్రమల ఏర్పాటుపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో ఏటీసీ టైర్ల కంపెనీని సీఎం జగన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రసంగించారు సీఎం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి అవార్డు దక్కిందన్నారు. జపాన్ కు చెందిన ఐటీసీ టైర్ల కంపెనీ కేవలం 15 నెలలోనే పూర్తయిందన్నారు.
2023 ఆగస్టు నాటికి రెండో దశ పనులు కూడా పూర్తవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు జగన్ రెడ్డి(YS Jagan). ఏ దేశమైనా లేదా ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ముందు పరిశ్రమలు ఎక్కువగా ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీలకు మరిన్ని వసతి సౌకర్యాలను కల్పించడం జరుగుతోందన్నారు. దేశంలో పేరొందిన ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు ఏపీపై ఫోకస్ పెట్టారని చెప్పారు.
ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఉత్సుకత చూపిస్తున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు వచ్చినా తాము ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందజేస్తామని స్పష్టం చేశారు సీఎం.
గత మూడు సంవత్సరాల కాలంలో ఏపీ రాష్ట్రానికి 17 భారీ పరిశ్రమలు వచ్చాయని, 39, 350 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
అంతే కాకుండా మూత పడిన పరిశ్రమలకు చేయూత ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : ఖాతాదారులకు ఎస్బీఐ ఝలక్