AP CM YS Jagan : దుర్గ‌మ్మ స‌న్నిధిలో జ‌గ‌న్ రెడ్డి

ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సీఎం

AP CM YS Jagan : విజ‌య‌వాడ – ఇంద్ర‌కీలాద్రిపై వెలిసిన శ్రీ క‌న‌క దుర్గ‌మ్మను ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌ర్శించుకున్నారు. ప్ర‌తి ఏటా అమ్మ వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ముఖ్య‌మంత్రి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీ. ప్ర‌స్తుతం ద‌స‌రా పండుగ‌ను పుర‌స్క‌రించుకుని న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. రోజుకు ల‌క్ష‌కు పైగా భ‌క్తులు అమ్మ వారిని ద‌ర్శించుకుంటున్నారు.

AP CM YS Jagan Visited

శ్రీ క‌న‌క దుర్గ‌మ్మ ఆల‌య పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి(AP CM YS Jagan). అమ్మ వారికి రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌పున ప‌ట్టు వ‌స్త్రాలు, పసుపు, కుంకుమ‌ల‌ను స‌మ‌ర్పించారు. అనంత‌రం అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు. పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా పూజారులు ఆయ‌న‌ను ఆశీర్వ‌దించారు. ఆల‌యం త‌ర‌పున శ్రీ క‌న‌క దుర్గ‌మ్మ చిత్ర ప‌టాన్ని, అమ్మ వారి ప్రసాదాన్ని అంద‌జేశారు.

అంత‌కు ముందు ఇంద్ర‌కీలాద్రిపై సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు పూజారులు, ఆల‌య పాల‌క మండ‌లి, ఈవో. జ‌గ‌న్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన వారిలో రాష్ట్ర దేవేదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఈవో కేఎస్ రామారావు ఉన్నారు.

Also Read : Jagan Mohan Rao : హెచ్‌సీఏ చీఫ్ గా జ‌గ‌న్మోహ‌న్ రావు

Leave A Reply

Your Email Id will not be published!