CM YS Jagan : అదానీ డేటా సెంటర్ తో 30 వేల జాబ్స్
ప్రకటించిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
CM YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. అదానీ గ్రూప్ డేటా సెంటర్ ఏర్పాటు కావడం వల్ల 30 వేల మందికి పైగా జాబ్స్ లభించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖలో అదానీ డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ డేటా సెంటర్ వల్ల విశాఖ పట్టణం టైర్ 1గా మార బోతుందని చెప్పారు.
రూ. 21 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ టెక్ పార్క్ దాదాపు 30 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జాబ్స్ కల్పించనుందని తెలిపారు. తన హయాంలో అదానీ డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే తాము ఐటీ, లాజిస్టిక్ రంగాలకు ప్రయారిటీ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి చోటా ఐటీ హబ్ లు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు.
ఐటీ పరంగా నిపుణులను తయారు చేయాలన్నది తన లక్ష్యమన్నారు. ఎక్కడికి వెళ్లి చదువు కోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్ని వసతులు కల్పించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్ రెడ్డి. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఇప్పటికే ఆయా రంగాలలో టెక్నాలజీ పరంగా నైపుణ్యం కలిగిన వారికి, అనుభవం ఉన్న వారికి జాబ్స్ లభిస్తాయని స్పష్టం చేశారు సీఎం జగన్ రెడ్డి(CM YS Jagan).
ఇప్పటికే తాను విశాఖ నగరాన్ని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా మార్చాలని కంకణం కట్టుకున్నట్లు తెలిపారు సీఎం. ఏపీకి రాజధానిగా ఉంటుందన్నారు.
Also Read : ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – జగన్