AP CM YS Jagan : కంపెనీల ఏర్పాటు భారీగా కొలువులు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటన
AP CM YS Jagan : ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా సమాధానం ఇచ్చారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చాయని, కానీ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు సీఎం. ఏపీలో గ్రీన్ కో కంపెనీ రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందన్నారు. ఇందులో 2,300 మందికి ఉద్యోగాలు కల్పించనుందని తెలిపారు. 2,300 మెగా వాట్ల విద్యుత్త్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.
AP CM YS Jagan Slams to Opposition
ఇక గ్రీన్ ఎనెర్జీ ద్వారా రూ. 4 వేల కోట్ల పెట్టబడి వచ్చిందని, 1000 మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. దీని ద్వారా 1014 మెగా వాట్ల విద్యుత్ జనరేట్ అవుతుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan).
మరో వైపు ఎకోరెన్ కంపెనీ 10 వేల కోట్ల ఇన్వెస్ట్ చేసిందని , 2000 మందికి ఉద్యోగాలు, 2000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుందని తెలిపారు. ఎన్హెచ్పీసీ తో కలిసి రాష్ట్ర సర్కార్ మరో 2000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 10 వేల కోట్ల పెట్టుబడి , 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు, కంపెనీలకు అనువుగా కీలకమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
Also Read : Nara Lokesh : నారా లోకేష్ మాస్ వార్నింగ్