AP CM YS Jagan : చంద్రబాబు గజ దొంగ – జగన్ రెడ్డి
అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపణ
AP CM YS Jagan : విజయవాడ – టీడీపీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శుక్రవారం వాహన మిత్ర సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడేనని పేర్కొన్నారు.
AP CM YS Jagan Comments on Chandrababu
ఇప్పటి వరకు ఆయన చేసినన్ని స్కాంలు ఇంకెవరూ చేయలేదని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గజదొంగలకు లీడర్ చంద్రబాబు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. ఫైబర్ గ్రిడ్ , స్కిల్ డెవలప్మెంట్ , ఇన్నర్ రింగ్ రోడ్ , అసైన్డ్ భూములు, నీరు చెట్టు, ఇలా ప్రతి దానీలోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.
తప్పు చేసిన వారు ఎవరైనా సరే జైలులో కాక ఇంట్లో పెట్టుకుంటామా అని ప్రశ్నించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(AP CM YS Jagan). దోచుకునేందుకు, పంచుకునేందుకు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడులా తనకు దత్త పుత్రుడు తోడుగా లేడని , దేవుడు , ప్రజలను మాత్రమే తాను నమ్ముకున్నానని చెప్పారు ఏపీ సీఎం జగన్ రెడ్డి.
వాహన మిత్ర సందర్బంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇబ్బందులకు గురి కాకూడదంటూ తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : Nara Lokesh Case : ,b> లోకేష్ అరెస్ట్ కు ఏపీ సీఐడీ సిద్దం