AP CM YS Jagan : ఏపీ రాజధానిపై జగన్ కీలక కామెంట్స్
తాను కూడా అక్కడికే వెళతానని ప్రకటన
AP CM YS Jagan : ఏపీలో రాజకీయలు మరింత వేడెక్కాయి. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతి రాజధాని అంటూ ప్రకటించారు. ఆ మేరకు భూములు కూడా తీసుకున్నారు. తీరా సర్కార్ మారింది. నిర్ణయం కూడా మారి పోయింది. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు ఉంటాయని వెల్లడించారు.
ఇదే సమయంలో మంగళవారం ఏపీ సీఎం ఏపీకి సంబంధించి రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన తాడేపల్లి గూడెం నుంచి పాలన సాగిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ లోనే ఫిలిం ఇండస్ట్రీ ఉందని , అగ్ర నటులు విశాఖకు రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు.
ఇందులో భాగంగా ఆయన చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఇక నుంచి ఏపీకి రాజధాని విశాఖ పట్టణమే అంటూ ప్రకటించారు. దీంతో గత కొంత కాలంగా విపక్షాలు చేస్తున్న విమర్శలకు తాళం వేసినట్లయింది. జగన్ రెడ్డి(AP CM YS Jagan) ఒక్కసారి కమిట్ అయ్యాడంటే తన మాట తానే వినడు అనేది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం సీఎం చేసిన ప్రకటనతో ఒక్కసారిగా వైజాగ్ లో రియల్ ఎస్టేట్ మాఫియాకు ఊతం ఇచ్చినట్లయింది.
త్వరలో తాను కూడా వైజాగ్ కే వెళతానంటూ ప్రకటించారు. అంతే కాదు తాను నమ్ముకున్న స్వామీజీ స్వరూపానంద్ర సరస్వతి కూడా విశాఖలో శారదా పీఠం ఏర్పాటు చేసుకున్నారు. మొత్తంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇది హాట్ టాపిక్ గా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మార్చిలో విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు రావాలని ఆహ్వానించారు సీఎం జగన్ రెడ్డి.
Also Read : కోర్టుకు ఎక్కిండు నవ్వుల పాలైండు