AP Assembly : ఏపీకి సంబంధించిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. వైసీపీతో పాటు టీడీపీ నేతలు కూడా హాజరయ్యారు.
లేవనెత్తిన పలు ప్రశ్నలకు తాపీగా సమాధానం ఇచ్చారు అచ్చెన్నాయుడు. ఇక సభలో అనవసరంగా గందరగోళం సృష్టించడం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏ అంశం మీదనైనా తాము చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో(AP Assembly) మేరుగ నాగార్జున చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. ఇదే సమయంలో శ్రీకాంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు.
కృష్ణా జిల్లా సమావేశంలో అర్జునుడు వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినప్పుడు మీరెందుకు ఆపలేదంటూ ప్రశ్నించారు. చర్చ కాస్తా మాజీ మంత్రి కొడాలి నాని వైపు మళ్లింది.
ఆయన భాష దారుణంగా ఉందని, వ్యక్తిగతంగా చెప్పలేని రీతిలో ఉంటున్నాయంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. ఇదే సమయంలో జోక్యం చేసుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
తన కుటుంబీకులను వైసీపీ నాయకులు ఏదో అన్నారంటూ టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు అనలేదా అన్నారు. ఆపై బోరున ఏడ్వడం కూడా చూడలేదా అని నిలదీశారు సీఎం.
పదవి లేక పోయినా ప్రచారం రాక పోయినా నిద్ర పట్టదు చంద్రబాబుకు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాసి ఇస్తే అయ్యన్న పాత్రుడు ఇష్టానుసారంగా మాట్లాడటం లేదా అని అన్నారు.
ఇదిలా తాము ఏది మాట్లాడినా ముందు చర్చించిన తర్వాతే ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. ఇదే సమయంలో మీ పార్టీ ఆఫీసును మీరే ధ్వంసం చేసుకుని తమపై బురద చల్లడం మంచి పద్దతి కాదన్నారు శ్రీకాంత్ రెడ్డి.
Also Read : 12 ఏళ్లయినా ‘గాలి’పై జరగని విచారణ