AP DGP : ఆంధ్రప్రదేశ్ – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాయడం కలకలం రేపింది. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ స్కిల్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించినట్లు ఏపీ సీఐడీ ఆరోపణలు చేసింది. ఈ మేరకు సుదీర్ఘ నివేదిక ఏసీబీ కోర్టుకు సమర్పించింది. దీంతో నవంబర్ 1 వరకు రిమాండ్ విధించింది.
AP DGP Comments on Chandrababu Letter
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ వివరణతో లేఖ రాశారు. ఈ లేఖపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. దీంతో ఏపీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించారు ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాసిన లేఖ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నిజా నిజాలు తేలిన తర్వాతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఇప్పటికే లేఖ వ్యవహారంపై వివరణ ఇచ్చారని తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు ఈ లేఖ జైలు నుంచి రాయలేదన్నారు డీజీపీ.
ఎవరి ద్వారా బయటకు వచ్చిందో తాము గుర్తిస్తామని, వారిని పట్టుకుని తీరుతామని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు రాజేంద్ర నాథ్ రెడ్డి.
Also Read : Nara Lokesh : ఏపీ సర్కార్ పై ఉమ్మడి యుద్ధం
