AP DIG Ravi Kiran : సెక్యూరిటీ సూప‌ర్ బాబు సేఫ్

24 గంట‌ల పాటు నిరంత‌ర నిఘా

AP DIG Ravi Kiran : రాజ‌మహేంద్ర‌వ‌రం – ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు భ‌ద్ర‌త గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంపై తీవ్రంగా స్పందించారు జైళ్ల శాఖ డీఐజీ ర‌వి కిర‌ణ్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

AP DIG Ravi Kiran Comments Viral

చంద్ర‌బాబు(Chandrababu) భ‌ద్ర‌త‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. 24 గంట‌ల సెక్యూరిటీతో పాటు పూర్తిగా సీసీ కెమెరాల‌ను కూడా ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. జైలు చుట్టూ ఐదు వాచ్ టవర్స్‌ ఉన్నాయ‌ని, బీపీఓ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్‌ జరుగుతుంద‌న్నారు.

ప్రతీ గంటకో మారు గార్డ్‌ సెర్చ్‌ చేస్తున్న‌ట్లు తెలిపారు డీఐజీ. ఎప్ప‌టిక‌ప్పుడు ఎస్పీతో మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు. ఈనెల 22న జైలు వాటర్‌ ట్యాంక్‌ వైపు ఒక డ్రోన్‌ తిరిగిందని నార్త్ ఈస్ట్‌ వాచ్ టవర్‌ గార్డు నుంచి త‌మ‌కు స‌మాచారం వ‌చ్చింద‌న్నారు. దీనిపై వివ‌ర‌ణ కూడా కోరామ‌న్నారు.

ఆయ‌న‌ను చంపేందుకు కుట్ర ప‌న్నుతున్నార‌న్న‌ది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు ర‌వి కిర‌ణ్. మావోయిస్టుల పేరుతో వ‌చ్చిన లేఖ నిజం కాద‌ని, అది పూర్తిగా న‌కిలీగా తేలింద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ లెట‌ర్ రాసిన‌ట్ల‌యితే జైళ్ల శాఖ సూప‌రింటెండెంట్ సంత‌కం ఉంటుంద‌న్నారు.

చంద్ర‌బాబు భ‌ద్ర‌త దృష్ట్యా ఆయ‌న‌ను ఏ ర్యాక్ లో ఉంచామ‌న్న‌ది బ‌య‌ట‌కు చెప్ప‌లేమ‌ని డీఐజీ ర‌వికిర‌ణ్ చెప్పారు.

Also Read : Kolusu Parthasarathi : జ‌గ‌న‌న్న సుర‌క్ష ఆరోగ్యానికి శ్రీ‌రామ ర‌క్ష

Leave A Reply

Your Email Id will not be published!