AP DSC Notification: ఈ నెల 5న ఏపీ టెట్, డీఎస్సీ ప్రకటన !
ఈ నెల 5న ఏపీ టెట్, డీఎస్సీ ప్రకటన !
AP DSC Notification: ఏపీలో(AP) నిరుద్యోగులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ, టెన్ నిర్వహణకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల (ఫిబ్రవరి) 5న విడుదల కానుంది. డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో 6,100 ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకు ఇటీవలే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ ఆమోందించింది. దీనితో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయడనికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 5న నోటిఫికేషన్ విడుదల చేసి ఆ రోజు నుండే ధరఖాస్తులు స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అధికారంలోనికి వచ్చి నాలుగున్నరేళ్ళ తరువాత కేవలం 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంపై నిరుద్యోగుల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యంలో పోస్టుల సంఖ్య పెంచమంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
AP DSC Notification – 12 ఏళ్ళ తరువాత మరల అప్రెంటిస్ షిప్ విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం
అధికారంలోనికి వచ్చి నాలుగున్నరేళ్ళ తరువాత డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్న వైసీపీ ప్రభుత్వం… డీఎస్సీ, టెట్ ను విడివిడిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. టెట్, డీఎస్సీలకు సిబిటి (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) అంటే అన్ లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఇప్పటికే టెట్ నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు విడుదల చేయడం జరిగింది. డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు సోమవారం విడుదల చేయనున్నారు. అయితే ఈసారి కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్ షిప్ విధానాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ అప్రెంటిస్ షిప్ విధానం ప్రకారం… ఈ డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ సమయంలో ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం భావిస్తే వారి అప్రెంటిస్‌షిప్ సమయాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
Also Read : Tahsildar Murder: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య !