AP Government: ఏపీ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు !
ఏపీ ఎక్సైజ్ శాఖలో ‘సెబ్’ రద్దు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు !
AP Government: వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కేటాయించిన 4,393 మంది (70 శాతం) ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృ శాఖలోకి తీసుకురానున్నారు. సెబ్ ఏర్పాటు కాక మునుపు ఎక్సైజ్‌శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించనున్నారు. సెబ్ రద్దుకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం విడుదల చేశారు.
AP Government Orders..
సెబ్ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న 6,274 మందిలో 1,881 (30 శాతం) మందిని మాత్రమే ఎక్సైజ్‌లో ఉంచి.. మిగతా వారందరినీ సెబ్‌కు కేటాయించారు. ఇప్పుడు వారిని మళ్లీ ఎక్సైజ్‌లోకి తీసుకురానున్నారు. వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేస్తారు. ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఏర్పాటుకానుంది.
Also Read : Tejashwi Yadav: బీహార్ సీఎం నితీష్ కుమార్ పై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు