AP Governor : అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందంజలో కొనసాగుతోందన్నారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్(AP Governor ). ఇవాళ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని ఆ మేరకు ఆయా రంగాలలో గణణీయమైన ప్రగతిని సాధించిందని చెప్పారు.
పాలన అన్నది పై నుంచి కాకుండా కింది స్థాయి వరకు తీసుకు వెళ్లాలనే సదుద్దేశంతో ఏపీ సీఎం మంచి పని చేశారంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అభినందించారు. గ్రామ సచివాలయాలు పని చేస్తుండడాన్ని అభినందించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పని చేస్తున్నాయంటూ కితాబు ఇచ్చారు గవర్నర్. ప్రభుత్వానికి ఉద్యోగులు మూలస్తంభాలని వారు మరింత కీలకంగా వ్యవహరించాలని సూచించారు.
కరోనా కారణంగా రెండేళ్ల పాటు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఏపీ రాష్ట్ర సర్కార్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని చెప్పారు. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ. 13, 500 చొప్పున సాయం అందజేసినట్లు తెలిపారు.
ఇప్పటి దాకా 52.38 లక్షల మంది రైతులకు రూ. 20, 162 కోట్ల సాయం చేశారని వెల్లడిచారు. 9 గంటల ఉచిత విద్యుత్ పథకం కింద 18 లక్షల మందికి పైగా రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు.
నేతన్న నేస్తం కింద 81, 703 మంది లబ్దిదారులకు రూ. 577 కోట్ల సాయం చేశారన్నారు. చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రాహ్మణులకు రూ. 583 కోట్లు ఆర్థిక సాయం అందజేశారని చెప్పారు గవర్నర్.
Also Read : హైకోర్టు తీర్పుపై వైసిపీ మూకుమ్మడి దాడి