AP Governor Visit : తిరుమల సన్నిధిలో గవర్నర్
ఘన స్వాగతం పలికిన చైర్మన్, ఈవో
AP Governor Visit : తిరుమల – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మా రెడ్డి ఘన స్వాగతం పలికారు. గవర్నర్(AP Governor) రాక సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అర్చకులు, పూజారులు పూర్ణ కుంభంతో ఘనంగా వెల్ కమ్ చెప్పారు.
AP Governor Visit Tirumala
గవర్నర్ , కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అర్చక బృందం ”ఇస్తిక ఫాల్” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అందించారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం తిరుమలలో అక్టోబర్ 15 నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం. విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read : Mission Chanakya : తెలంగాణలో గులాబీదే జెండా