AP New Districts SP’s : ఏపీలో 26 జిల్లాల‌ ఎస్పీలు వీరే

సీఎం జ‌గ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్

AP New Districts SP’s  : ఏపీ ప్ర‌భుత్వం కొత్త‌గా 13 జిల్లాల‌తో క‌లిపి పాత 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల‌కు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను నియ‌మించింది.

ఈ మేర‌కు సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ఇప్ప‌టికే ఆయా జిల్లాల‌కు క‌లెక్ట‌ర్ల‌ను నియ‌మించిన సీఎం ఎస్పీల‌ను(AP New Districts SP’s కూడా నియ‌మించేందుకు ఓకే చెప్పారు.

దీంతో ఆయా జిల్లాల‌కు సంబంధించి ఎస్పీల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

శ్రీ‌కాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్. రాధిక‌, విజ‌య‌న‌గ‌రం ఎస్పీగా ఎం. దీపిక‌, పార్వ‌తీపురం ఎస్పీగా వాస‌న విద్య సాగ‌ర్ నాయుడు,

అన‌కాప‌ల్లి ఎస్పీగా గౌత‌మి సాలిని నియ‌మించారు.

ఇక అల్లూరి సీతారామ‌రాజు ఎస్పీగా స‌తీశ్ కుమార్ , కాకినాడ ఎస్పీగా ర‌వీంద్ర నాథ్ బాబు, కోన‌సీమ జిల్లా ఎస్పీగా కే.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి, తూర్పుగోదావ‌రి జిల్లా ఎస్పీగా ఐశ్వ‌ర్య ర‌స్తోగిని నియ‌మించింది.

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఎస్పీగా ర‌వి ప్ర‌కాశ్ , ఏలూరు ఎస్పీగా ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, కృష్నా జిల్లా ఎస్పీగా సిద్దార్థ కౌశ‌ల్ , విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్ గా క్రాంతి రాణా టాటా,

గుంటూరు అర్బ‌న్ ఎస్పీగా కె. ఆరిఫ్ హ‌ఫీజ్ , ప‌ల్నాడు జిల్లా ఎస్పీగా ర‌వి శంక‌ర్ రెడ్డిని నియ‌మించింది ఏపీ స‌ర్కార్(AP New Districts SP’s ).

బాప‌ట్ల జిల్లా ఎస్పీగా వ‌కుల్ జిందాల్ , ప్ర‌క‌శాం జిల్లా ఎస్పీగా మ‌ల్లిక గార్గ్, నెల్లూరు జిల్లా ఎస్పీగా సీ హెచ్ విజ‌య రావు ,

తిరుప‌తి ఎస్పీగా ప‌ర‌మేశ్వ‌ర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీగా రిశాంత్ రెడ్డిని నియ‌మించింది.

అన్న‌మ‌య్య ఎస్పీగా హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాజు, క‌డ‌ప ఎస్పీగా అన్బూరాజ‌న్ , అనంత‌పురం ఎస్పీగా ఫ‌కీర‌ప్ప,

శ్రీ స‌త్యాసాయి ఎస్పీగా రాజుల్ దేవ్ సింగ్ , క‌ర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డిని నియ‌మించింది ప్ర‌భుత్వం.

నంద్యాల ఎస్పీగా కె ర‌ఘువీరా రెడ్డి, విశాఖ క‌మిష‌న‌ర్ గా సీ. హెచ్. శ్రీ‌కాంత్ ను ఎంపిక చేసింది.

Also Read : మీ గ‌డువులు మాకు కుద‌ర‌వంటున్న జ‌గ‌న్ స‌ర్కారు

Leave A Reply

Your Email Id will not be published!