AP Govt Ban : ప్లాస్లిక్ ఫ్లెక్సీలపై ఏపీ సర్కార్ నిషేధం
నవంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు
AP Govt Ban : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఇక నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేసింది.
ఈ మేరకు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం ఆ రోజు నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.
ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీతో పాటు దిగుమతి చేసుకునేందుకు కూడా పర్మిషన్ లేదంటూ తెలిపింది. ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్లాస్టిక్ ప్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా , ప్రదర్శనపై కూడా నిషేధం(AP Govt Ban) వర్తిస్తుందని పేర్కొంది.
ప్రభుత్వం జారీ చేసిన నిషేధపు ఉత్తర్వులు అమలు పర్యవేక్షణ బాధ్యత పట్టణాలు, నగరాలకు చెందిన అధికారులదేనని వెల్లడించింది.
అంతే కాకుండా ఎవరైనా సర్కార్ రూల్స్ పాటించక పోతే ప్రతి ఫ్లెక్సీకి రూ. 100 జరిమానా కూడా విధిస్తామని ఆదేశించింది.
అంతే కాకుండా రాష్ట్రంలోని గ్రామాలలో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత ఆయా జిల్లాల బాధ్యతలు చూస్తున్న కలెక్టర్లదేనంటూ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.
ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. కలెక్టర్లతో పాటు సంబంధిత పోలీస్, రవాణా , జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం(AP Govt Ban).
ప్లాస్టిక్ వస్తువులకు బదులు కాటన్ , నేత వస్త్రాలు వాడాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : డిసెంబర్ నాటికి ఇళ్ల పంపిణీ – జగన్