CM YS Jagan : సీఎం జగన్ రెడ్డి ఖుష్ కబర్
కడపలో రూ. 24 వేల కోట్లు ఇన్వెస్ట్
CM YS Jagan : ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఖుష్ కబర్ చెప్పారు. కడప జిల్లాకు ఆయన తీపి కబురు చెప్పారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు పచ్చ జెండా ఊపారు. ఈ ప్లాంట్ కు రూ. 24 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిని స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్వహిస్తుంది.
ఇది రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్టు కావడం విశేషం. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. స్టీల్ ప్లాంట్ తో పాటు కీలక ప్రాజెక్టులకు కూడా ఆమోదం తెలిపింది ఎస్ఐపీబీ. ఇదిలా ఉండగా ఈ స్టీల్ ప్లాంట్ కోసం రెండు విడతలుగా నిధులు ఖర్చు చేయనుంది.
తొలి విడతగా రూ. 8,800 కోట్లతో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. రెండో విడత కింద రూ. 3,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరానికి 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తులను తయారు చేయడమే లక్ష్యంగా చేసుకుంది. ఆమోదం తెలపడంతో వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటును వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan).
ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాది మందికి అవకాశం కలుగుతుందన్నారు. దీని వల్ల రాయలసీమ ముఖ చిత్రం పూర్తిగా మారి పోతుందన్నారు ఏపీ సీఎం. స్టీల్ ప్లాంట్ తో పాటు 1600 మెగా వాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు కూడా ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 6,330 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
Also Read : బీఆర్ఎస్ కోసం సీఎం హస్తినకు పయనం