AP New Districts : ఏపీ జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనీఎల 4న ఆన్ లైన్ ద్వారా ప్రారంభించనున్నారు.
ఈ మేరకు ఆయా జిల్లాలకు సంబంధించి కొత్తగా కలెక్టర్లు, ఎస్పీలను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు 13 జిల్లాలు ఉండగా కొత్తగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసింది సర్కార్.
ఇక జిల్లాల వారీగా చూస్తే కలెక్టర్లు ఇలా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా శ్రీకేశ్ బాలాజీరావు, విజయనగరంకు సూర్యకుమారి, మన్యం జిల్లా కలెక్టర్ గా నిశాంత్ కుమార్ ను నియమించారు.
ఇక విశాఖ జిల్లా కలెక్టర్ గా మల్లికార్జున్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ , అనకాపల్లి కలెక్టర్ గా రవి సుభాష్ , కాకినాడ కలెక్టర్ కృతికా శుక్లాను నియమించింది ప్రభుత్వం.
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా మాధవీలత, కోనసీమ కలెక్టర్ గా హిమాన్షు శుక్లా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రశాంతి, ఏలూరు కలెక్టర్ గా ప్రసన్న వెంకటేశ్ ను నియమించింది.
కృష్ణా జిల్లా కలెక్టర్ గా రంజిత్ భాషా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా ఎస్. దిల్లీరావు, గుంటూరు కలెక్టర్ గా వేణు గోపాల్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివ శంకర్ , బాపట్ల జిల్లాకు విజయ, ప్రకాశం జిల్లాకు దినేశ్ కుమార్ ను నియమించింది ఏపీ సర్కార్AP New Districts).
నెల్లూరు జిల్లా కలెక్టర్ గా చక్రధర్ బాబు, శ్రీ బాలాజీ (తిరుపతి ) జిల్లా కలెక్టర్ గా వెంకట రమణా రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరి నారాయణ , అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా శ్రీ గిరీష , కడప జిల్లా కలెక్టర్ గా వజియ రామ రాజు ను నియమించింది.
ఇక శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ , అనంతపురం జిల్లా కలెక్టర్ గా నాగలక్ష్మి, నంద్యాల కలెక్టర్ గా మనజీర్ జిలానీ శామూన్ , కర్నూలు కలెక్టర్ గా కోటేశ్వర్ రావును నియమించింది ప్రభుత్వం.
Also Read : బిజేపి – వైసిపిల నడుమ మాటల తూటాలు