Pendyala Srinivas : బాబుకు షాక్ పెండ్యాల‌పై వేటు

స‌స్పెండ్ చేసిన ఏపీ సెక్ర‌ట‌రీ

Pendyala Srinivas : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు(Chandrababu Naidu) మాజీ ప్రైవేట్ కార్య‌ద‌ర్శి పెండ్యాల శ్రీ‌నివాస్ ను స‌స్పండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

పెండ్యాల శ్రీ‌నివాస్ ఏపీ ప్ర‌భుత్వ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ సెక్ర‌ట‌రీగా ఉన్నారు. ఏపీ స్కిల్ స్కామ్ లో పెండ్యాల కీల‌కంగా ఉన్నార‌ని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేర‌కు ఆయ‌న‌కు కూడా నోటీసులు జారీ చేసింది. మొత్తంగా ఈయ‌న కేంద్రంగా ఈ మొత్తం కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని సీఐడీ ఆరోపించింది.

Pendyala Srinivas Got Viral

సీఐడీ కేసు న‌మోదు చేసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా దేశంలోనే లేకుండా పోయాడు. విదేశాల‌కు చెక్కేశాడు. మాజీ సీఎం చంద్ర‌బాబుకు పీఏగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం నైపుణ్యాభివృద్ది కేసులో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఆయ‌న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో ఊచ‌లు లెక్క బెడుతున్నారు. ఇదే క్ర‌మంలో అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ కేసులో చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ కు షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ. ఈ మేర‌కు నోటీసు కూడా ఇచ్చింది. ఈ త‌రుణంలో మాజీ సీఎం , మాజీ పీఏ పెండ్యాల శ్రీ‌నివాస్ పై వేటు వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Also Read : Telangana TOP : భూగ‌ర్భ జ‌లాల పెంపులో తెలంగాణ టాప్

Leave A Reply

Your Email Id will not be published!