AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తూ వస్తున్న సీనియర్ అధికారులకు కోలుకోలేని ఝలక్ ఇచ్చింది.
వారంతా పేరు పొందిన సీనియర్లు కావడం విశేషం. కోర్టు ఇచ్చిన ఆదేశాలు పక్కన పెట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. ఈ మేరకు ఏడాది పాటు జైలు శిక్ష విధఙస్తూ తీర్పు చెప్పింది.
అయితే తప్పయిందని క్షమించమని కోరారు ఐఏఎస్ (IAS) అధికారులు. శిక్ష పడిన వారంతా బేషరతుగా క్షమాపణలు కూడా చెప్పారు. పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాకుండా చూస్తామంటూ తప్పు ఒప్పుకున్నారు.
ఈ మేరకు కోర్టుకు (Court) విన్నవించారు. దీంతో కాస్తా మెత్త పడింది ఏపీ కోర్టు ధర్మాసనం(AP High Court). జైలు శిక్షకు బదులుగా ఏడాది వరకు ప్రతి నెలా వారిలో మార్పు వచ్చేంత వరకు సంక్షేమ హాస్టళ్లకు వెళ్లాలని, అక్కడ సేవ చేయాలని ధర్మాసనం సీరియస్ అయ్యింది.
సంవత్సరం కాలం పాటు సంక్షేమ వసతి గృహాలలో ఒక్క పూట భోజనం పిల్లలకు పెట్టాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఉన్నతాధికారులకు సంబంధించి చూస్తే విజయ్ కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్ , శ్రీలక్ష్మి, గిరిజా శంకర్ , వాడ్రేవు చిన వీరభద్రుడు, ఎం.ఎం. నాయక్ లు ఉన్నారు.
వీరంతా పేరు మోసిన ఉన్నతాధికారులు. కానీ వీరు కోర్టును లెక్క చేయలేదు. దానిని పట్టించు కోలేదు. గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్ ప్రాంగణాళు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించ కూడదని ఆదేశించింది గతంలో కోర్టు.
దీనిని పట్టించుకోని వీరిపై రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది.
Also Read : కొత్త జిల్లాలకు ఏపీ కేబినెట్ ఓకే