AP High Court : అమరావతి – అమరావతి రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి అసైన్డ్ ల్యాండ్ కేసుకు సంబంధించి హైకోర్టు విచారణ చేపట్టింది. నవంబర్ 1కి కేసు విచారణ వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ. ఇవాళ తీర్పు ఇచ్చేందుకు సిద్దమైన కోర్టు. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఈ కేసుకు సంబంధించి కొత్త ఆధారాలు ఉన్నాయని కోర్టులో పిటిషన్ వేసింది ఏపీ సీఐడీ.
AP High Court Viral
ఉన్నట్టుండి ఆధారాలు సమర్పించడంతో హైకోర్టు(AP High Court) ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు గాను ఆడియా ఆధారాలు అందజేసింది. అక్టోబర్ 17న మంగళవారం వీడియోలను కూడా సమర్పిస్తామని ఏపీ సీఐడీ స్పష్టం చేసింది కోర్టుకు.
మరో వైపు కొత్త ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ మరో పిటీషన్ దాఖలు చేసింది హైకోర్టులో. గతంలో నమోదైన పిటిషన్ తో పాటు తాజాగా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టింది ధర్మాసనం. పూర్తిగా విచారించిన కోర్టు అమరావతి ల్యాండ్ కేసును వచ్చే నెల నవంబర్ 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది ధర్మాసనం.
మరో వైపు ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ స్కాం కేసులపై కోర్టు విచారణ చేపట్టింది.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ