AP High Court : ఎంపీ రఘురామపై హైకోర్టు సీరియస్
ఎలా పాలించాలో ప్రభుత్వానికి తెలుసు
AP High Court : ఏపీ ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు షాక్ తగిలింది. సంక్షేమాన్ని ఆపాలంటూ ఎంపీ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ఏపీ హైకోర్టు(AP High Court) విచారణ చేపట్టింది. కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో రుణాలు ఎలా తీసుకోవాలో ఒక ఎంపీగా ఎలా నిర్ణయిస్తారంటూ ప్రశ్నించింది. అప్పులు ఇచ్చే వాళ్లకు లేని ఇబ్బంది మీకు ఎందుకంటూ నిలదీసింది.
ఇది పూర్తిగా నిర్దరక వ్యాజ్యం. ఇందులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఏం ఉన్నాయంటూ ఫైర్ అయ్యింది కోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని ఎలా అడుగుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒకవేళ ప్రభుత్వ కార్పొరేషన్లకు నిధులు మళ్లిస్తే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారంటూ మండిపడింది ఎంపీపై. రేపొద్దున కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ లను కూడా సవాల్ చేస్తారంటూ చురకలు అంటించింది. ఎంపీపై కోర్టు(AP High Court) షాకింగ్ కామెంట్స్ చేసింది.
ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరు ఎవరంటూ సీరియస్ అయ్యింది. మొత్తంగా చూస్తే సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ పిల్ వేసినట్లు అర్థం అవుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ కార్యదర్శుల కామని స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం తమ పని కాదని స్పష్టం చేసింది.
ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారించింది.
Also Read : కేసీఆర్ పాలనలో మహిళలకు భద్రత కరువు