AP High Court TTD : ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. ఏడాది పాటు నెలలో ఒక రోజు సంక్షేమ హాస్టళ్లలో ఉండాలని, వారికి భోజనం వడ్డించాలని, ఇదంతా స్వంత ఖర్చులతో భరించాలని ఆదేశించింది.
ఈ తరుణంలో గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది హైకోర్టు(AP High Court). తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD )పాలక మండలి లో సభ్యుల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
నేర చరిత్ర కలిగిన వారిని సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ నిలదీసింది. భారతీయ జనతా పార్టీ నాయకుడు భాను ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. నేర చరిత్ర కలిగిన వారికి టీటీడీ(AP High Court) పాలక మండలిలో పదవులు ఎలా ఇస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.
ఇదిలా ఉండగా నియమించిన వారిలో ఎక్కువ మంది నేర చరిత్ర కలిగిన వారున్నారని, ప్రత్యేక ఆహ్వానితులు జంబో జట్టుగా మారిందని పిటిషన్ లో పేర్కొన్నారు.
దీనిపై కూడా నిలదీసింది కోర్టు. ఇక ప్రభుత్వం తరపున ఏమీ వినదల్చు కోలేదని ఏప్రిల్ 19న తుది తీర్పు వెలువరిస్తామంటూ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏదో లబ్ది చేకూరడం వల్లనే ఇలా చేస్తున్నారంటూ హైకోర్టు ఫైర్ అయ్యింది.
Also Read : ఉత్తరాయణం వచ్చే నాటికి జమ్ము శ్రీవారి ఆలయం