AP Inter Results: ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
AP Inter Results : ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను శనివారం ఉదయం మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) విడుదల చేశారు. తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్‌లో వేదికగా ఈ ఫలితాలను విడుదల చేసారు. కాగా.. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే కూడా ఈ ఏడాది అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యింది. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా… సెకండ్ ఇయర్ లో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ పరీక్షల్లో పదేళ్లలో కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ… గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. కాగా ఈ ఏడాది మార్చి 1 నుంచి 10 వరకూ 1535 పరీక్షా సెంటర్లలో ఇంటర్ ప్రధమ, ద్వీతీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకూ 25 క్యాంపులలో మూల్యాంకనం నిర్వహించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్, ఓకెషనల్, ప్రైవేట్ కలిపి 5 లక్షల 25 వేల 848 మంది విద్యార్ధులు హజరుకాగా.. ద్వితీయ సంవత్సరానికి 4 లక్షల 91వేల 254 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు10 లక్షల 17వేల 102 మంది విద్యార్థులు హాజరయ్యారు.
AP Inter Results – ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాదే అగ్రస్థానం
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 85 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు అగ్రస్థానం నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా 93 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ఇక ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 54 శాతం ఉత్తీర్ణతతో చిత్తూరు జిల్లాకు చివరి స్థానం రాగా… సెకండ్ ఇయర్ ఫలితాల్లో 73 శాతం ఉత్తీర్ణతతో అల్లూరి జిల్లాకు ఆఖరి స్థానంలో నిలిచింది.
మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
మే 12 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ(AP) ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి మే 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 28 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష జూన్ 4న, పర్యావరణ విద్య జూన్ 6న నిర్వహించనున్నారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.
Also Read : South Central Railway: వేసవి రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి 42 స్పెషల్ ట్రైన్స్