AP JAC Strike Warning: ప్రభుత్వానికి ఉద్యోగుల సమ్మె హెచ్చరికలు ?
ప్రభుత్వానికి ఉద్యోగుల సమ్మె హెచ్చరికలు ?
AP JAC Strike Warning: 42 రెండు రోజుల అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నిరవధిక సమ్మెకు శుభం కార్డు వేసిన ఏపీ ప్రభుత్వానికి… మరో సమ్మె ముప్పు పొంచి ఉందా అంటే…. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీనికి తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెకు కూడా వెనుకాడబోమంటూ ఏపీ(AP) జేఏసీ నేత బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత కొంతకాలంగా సైలంట్ గా ఉన్న ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు… ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఈ నెల 11న ఏపీ జేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని… ఇందుకు సంబంధించిన వినతిని 12న సీఎఎస్కి అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
AP JAC Strike Warning Viral
ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ‘‘ఉద్యోగులకు పీఎఫ్ సొమ్ము సకాలంలో అందడం లేదు. మేం దాచుకున్న మొత్తాన్ని సరైన సమయానికి తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ రాలేదు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న రెండు డీఏలు ఇవ్వలేదు. ఒకటో తేదీన జీతం, పింఛన్ కచ్చితంగా అందుకుంటామన్న నమ్మకం ఉద్యోగుల్లో పోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో 11న కార్యవర్గ సమావేశం నిర్వహించి… సమ్మెకు దిగడానికి సిద్ధమైనట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికల ముందు అధికార వైసీపీకు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Telangana Congress : ఎంపీ టిక్కెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో లొల్లి.. అధిష్టాన తీర్పుకోసం ఎదురుచూపు