Gudivada Amarnath : బాధితులను పరామర్శించిన అమర్ నాథ్
బాలా సోర్ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
Gudivada Amarnath : ఒడిశా లోని బాలా సోర్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొన్న ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సందర్శించారు. బాధితులను పరామర్శించారు. ఇదిలా ఉండగా ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్ నాథ్(Gudivada Amarnath) హుటా హుటిన బాలా సోర్ కు వెళ్లారు. అక్కడ పరిస్థితిని కళ్లారా చూశారు.
ఆ వెంటనే బాలా సోర్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అక్కడి ఆస్పత్రి ఇంఛార్జ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత మంది చని పోయారు, ఎంత మంది గాయపడ్డారనే దానిపై సూపరింటెండెంట్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు వివరించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్ నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందన్నారు. తమ రాష్ట్రానికి చెందిన తెలుగు వారు ఎవరు ఉన్నా వారిని సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం రైలు ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారని తెలిపారు. కాగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని , ఉన్నతాధికారులతో మాట్లాడారని ఎప్పటికప్పుడు వివరాలు తనకు అందజేయాల్సిందిగా ఆదేశించారని చెప్పారు గుడివాడ అమర్ నాథ్. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరపున తాను ఇక్కడికి రావడం జరిగిందన్నారు.
Also Read : DK Shiva Kumar