Draupadi Murmu : ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న అభ్యర్థి
Draupadi Murmu : భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ఒడిశాకు చెందిన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఏపీకి చేరుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇప్పటికే ఒడిశాకు చేరుకున్నారు.
కానీ ఈనెల 11న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అనివార్య కారణాల రీత్యా తన టూర్ ను రద్దు చేసుకున్నారు. కానీ ఏపీలో పర్యటించేందుకు మాత్రం ఓకే చెప్పారు.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమెకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆమె గెలవాలంటే ఇంకా 8 వేలకు పైగా ఓట్లను సాధించాల్సి ఉంటుంది మోదీ ప్రభుత్వం. ప్రతిపక్షాలకు చెందిన ఉమ్మడి రాష్ట్ర పతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు.
పోటీ మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగనుంది. ఇక రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu) బేషరతుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైఎస్సార్ సీపీ చీఫ్, సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు.
ఆమె నామినేషన్ దాఖలు చేసిన సమయంలో సైతం ఎంపీ విజయ సాయి రెడ్డితో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. తాజాగా ఏపీలోని గన్నవరంకు చేరుకున్న ద్రౌపది ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘన స్వాగతం పలికారు ఎంపీలు.
గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన వారిలో విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, మార్గాని భరత్ , గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఎంపీలు స్వాగతం పలకడంతో ఆనందానికి లోనయ్యారు ద్రౌపది ముర్ము.
Also Read : మోదీ మౌనం దేశానికి ప్రమాదం – రాహుల్