Nara Lokesh Padayatra : నారా లోకేష్ యాత్ర‌కు లైన్ క్లియ‌ర్

ష‌ర‌తుల‌తో పాద‌యాత్ర‌కు ఓకే

Nara Lokesh Padayatra : ఏపీలో టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేష్ పాద‌యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. 14 ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి మంజూరు చేశారు. బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించే కంటే ముందు అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంది. నివేదించిన టైం కంటే ముందు క్లోజ్ చేయాలి. ఎలాంటి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు ఉండ కూడ‌దు. పోలీసులు సూచన‌లు త‌ప్ప‌క పాటించాలి.

ఇప్ప‌టికే చంద్ర‌బాబు స‌భ‌ల్లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట కార‌ణంగా ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ చేప‌ట్టిన యువ గ‌ళం పాద‌యాత్ర‌కు(Nara Lokesh Padayatra) కండీష‌న్స్ పెట్టారు పోలీసులు. రోడ్ల‌పై పాద‌యాత్ర చేప‌ట్టిన సంద‌ర్భంగా ఎలాంటి స‌మావేశాలు చేప‌ట్ట కూడ‌ద‌ని ఆదేశించారు.

విధుల్లో ఉన్న పోలీస్ ఆఫీస‌ర్స్ సూచ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. భ‌ద్ర‌త నిర్వ‌హ‌ణ‌లో, ట్రాఫిక్ కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా స‌హ‌క‌రించాల‌ని సూచించారు.

మ‌రో వైపు 14 కండీష‌న్స్ తో ఎలా పాద‌యాత్ర చేప‌ట్టాలంటూ నారా లోకేష్ ప్ర‌శ్నించారు. తాము రాష్ట్రంలో ప్ర‌జ‌ల కోసం పాద‌యాత్ర చేస్తున్నామ‌ని ప‌ద‌వుల కోసం కాదంటూ స్ప‌ష్టం చేశారు. జ‌న‌వ‌రి 25న నారా లోకేష్ హైద‌రాబాద్ నుంచి బ‌య‌లు దేరుతారు. 27న కుప్పం నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తారు.

క‌డ‌ప‌లో పెద్ద ద‌ర్గాను ద‌ర్శించుకుంటారు. అక్క‌డి నుంచి చ‌ర్చిలో ప్రార్థ‌న‌లు చేస్తారు. ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ రూట్ మ్యాప్ కూడా లోకేష్ పాద‌యాత్ర కోసం త‌యారు చేసింది.

Also Read : అంజ‌న్న స‌న్నిధిలో జ‌న‌సేనాని

Leave A Reply

Your Email Id will not be published!