AP Police: రెంటపాళ్ల ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు
రెంటపాళ్ల ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు
AP Police : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేసారు. పీడీపీపీ యాక్ట్ (ప్రజా ఆస్తికి నష్ట నిరోధక చట్టం) కింద నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేసి ప్రజలు, స్కూల్స్, ఆస్పత్రులకు ఇబ్బంది కలిగించిన అంశంలో వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
AP Police Serve Notices
మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాశ్, తదితర నేతలపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు (AP Police). నోటీసులు అందడంతో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కి విచారణకు మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైకాపా నేతల గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి వచ్చారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన పలు అంశాలపై పోలీసులు వారిని ప్రశ్నించినట్లు సమాచారం. గత నెల 18న సత్తెనపల్లిలో నిబంధనలు ఉల్లంఘించి బల ప్రదర్శన చేయడం, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడంపై నమోదైన కేసులో 113 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు ఉన్నారు.
Also Read : Vande Bharat Express: ఏపీలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
