AP Rains : తీరం దాటిన తుఫాన్..ఆ జిల్లాల్లో ఇంకా వర్షాలు
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది...
AP Rains : దక్షిణ కోస్తాంధ్ర దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా తమిళనాడులో కేంద్రీకృతమైన బాగా గుర్తించంచబడిన అల్పపీడనం దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 06 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతములో అక్టోబర్ 20 వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది . దీని ప్రభావంతో అక్టోబరు 22 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత అది వాయువ్య దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉంది.
AP Rains Update..
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్(AP)
ఈరోజు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టముగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్థాయి
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ
ఈరోజు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు గంటకు 35 -45 కిలోమీటర్లు గరిష్టముగా 55 కిలోమీటర్ల వేగముతో వీస్థాయి .
రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
Also Read : KCR : డిసెంబర్ లో జనంలోకి గులాబీ జెండా అధినేత ‘కేసీఆర్’