AP Skill Scam : ఏపీ స్కిల్ స్కాంలో బాబే కీల‌కం

హైకోర్టులో పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి

AP Skill Scam : విజ‌య‌వాడ – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కీం స్కాంకు సంబంధించి బుధ‌వారం బెజ‌వాడ లోని ఏసీబీ కోర్టులో వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే రిమాండ్ ఖైదీగా ఉన్న నారా చంద్ర‌బాబు నాయుడుకు ఇప్ప‌ట్లో బెయిల్ వ‌చ్చే ఛాన్స్ క‌నిపించ‌డం లేదు.

AP Skill Scam Viral

ఆయ‌న దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్ ను హైకోర్టు కొట్టివేసింది. దానిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్క‌డ కేసు విచార‌ణ సోమ‌వారానికి వాయిదా వేశారు జ‌డ్జి. ఇదే స‌మ‌యంలో ఏసీబీ కోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రింది. ప్రభుత్వం త‌ర‌పున న్యాయ‌వాది పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు.

స్కిల్ డెవల‌ప్ మెంట్ అనేది యువ‌త కోసం కాద‌ని కేవ‌లం చంద్రబాబు నాయుడు(Chandrababu) కోసం ఏర్పాటు చేసుకున్నారంటూ తెలిపారు. దీనిని ఆధారంగా చేసుకుని ప‌క్కా స్కెచ్ వేశారని, రూ. 371 కోట్లు స్వాహా చేశార‌ని ఆరోపించారు . ఈ సంస్థ కేవ‌లం చంద్ర‌బాబు కోస‌మే సృష్టించార‌ని తెలిపారు.

అందులో ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ది చేకూర్చేలా చేశార‌ని ఆరోపించారు. ఈ సంస్థ కేవలం చంద్రబాబు కోసమే సృష్టించబడింది. 2018లో అప్ప‌టి రాష్ట్ర స‌ర్కార్ సీబీఐ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో కంటి తుడుపు విచార‌ణ‌కు ఆదేశించార‌ని పేర్కొన్నారు పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి.

Also Read : BRS Manifesto : 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో

Leave A Reply

Your Email Id will not be published!